Wednesday, May 13, 2026

Wednesday, April 29, 2026

విజయవాడ 29.4.26

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

         *శ్రీ శైవ మహాపీఠము* 
              *విజయవాడ* 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


భగవత్ భక్తులకు నమస్కారం. 

 *పూజ్య పీఠాధిపతులు శ్రీ అత్తలూరిమృత్యుంజయ శర్మ గారి అనుగ్రహముతో ,*

 *ఉపపీఠాదిపతులు శివశ్రీ మల్లంపల్లి దుర్గా మల్లిఖార్జున ప్రసాద్ గారి దివ్య ఆశీస్సులతో* 

జ్యోతిష, వాస్తు సిద్ధాంతి 
శివశ్రీ కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు నిర్ణయించిన దివ్యమైన ముహూర్తములో విజయవాడ శాఖ ఆస్థాన ఆచార్యుడు
శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి వేద మంత్రోచ్ఛరణల నడుమ విఘ్నేశ్వర పూజ,వాస్తు పూజతో ప్రారంభమైన నేటి దేవాలయ పునర్ అభివృద్ధి కార్యక్రమం, ఈ సమస్త చరాచార జగత్తుకు తల్లి తండ్రులైన ఆ పార్వతి పరమేశ్వరునల కృపా కటాక్షములతో , శ్రీ శ్రౌతశైవ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ, శ్రీ శైవ మహాపీఠ కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, మరియు కవాడిగూడ శంకరారాధ్య మఠం ఫిట్పర్సన్ గారలు ఇచ్చిన ప్రోత్సాహముతో, ఆరాధ్య బంధువులు , ఇతర భక్తులు ఇచ్చిన సహకారముతో ఘనముగా పూర్తి అయినది. 

     నేటి కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరూ 
ఆ పార్వతి పరమేశ్వరులకు నమస్కరించి టెంకాయ కొట్టి  దేవాలయ పునర్ అభివృద్ధి నిర్విఘ్నముగా పూర్తి కావాలని కోరుకున్నారు. 

 శివశ్రీ శ్రీపతి పండితారాధ్యుల వీరభద్ర శాస్త్రిగారు, వీరి కుమారుడు శివశ్రీ మల్లికార్జున్ గారు, కోడలు శ్రీమతి రమగారు, కైలాసవాసులు శివశ్రీ ముదిగొండ శివానందం గారు, శ్రీమతి వర్ధనమ్మగార్ల జ్ఞాపకార్ధం వారి కుమార్తె శ్రీమతి బొమ్మకంటి కాత్యాయని గార్లు , శ్రీ మన్నెం పూర్ణచంద్ర రావు గారలు భూరి విరాళములు ప్రకటించారు.అలాగే కార్యక్రమమునకు పూర్వమే భూరి విరాళం అందచేసిన తాడేపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు.

 శ్రీమతి మల్లంపల్లి సుబ్బలక్ష్మి గారు, శ్రీమతి చివులూరి కనకదుర్గాంబ గారలు ఈ శుభ సందర్భంగా విరాళములు అందచేసినారు.
 
పై వారందరికీ పీఠము తరఫున సత్కారం , వేద ఆశీర్వచనం కావించటము జరిగినది. 
ఈ కార్యక్రమములో పాల్గొన్న భక్తులు అందరికీ ప్రసాద వితరణతో నేటి కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య దిగ్విజయముగా ముగిసినది. 

     కార్యవర్గ సభ్యులు అందరూ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఎంతో కృషిచేశారు. 
అందరికీ నమస్సుమాంజలులు .🙏🏼🙏🏼