Wednesday, February 25, 2026

రజిత మకర తోరణం

   *శ్రీ శైవ మహా పీఠం*   *విజయవా

*భక్తులకు శుభ సమాచారం* 


   మన శ్రీ శైవ మహాపీఠం , విజయవాడ మరొక ఉత్సాహభరితమైన, సంతోషపూరితమైన వాతావరణానికి, భక్తుల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, సమర్పణకు వేదిక అయినది. 


శ్రీ తాడేపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ గారు,శ్రీమతి శైలజ దంపతులు వెండిధరలు ఎగబాకుతున్న సమయంలో వెనకడగు వేయకుండా

 ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే సర్వస్వం అనుకొని అపరిమిత ధనాన్ని వెచ్చించి ద్ధగ  ద్ధగాయ మానంగా వెలిగొందుతున్న రజత మకరతోరణాన్ని తయారు చేయించారు.

 

   శైవ మహాపీఠ పండిత మండలి సభ్యుడు అయిన శ్రీ బాల శశాంక మౌళి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ రోజు ఉదయం 9.09 నిమిషములకు శ్రీ విఘ్నేశ్వర పూజతో నూతన రజత మకర తోరణ సoప్రోక్షణ కార్యక్రమం ప్రారంభించబడింది. 


   తదుపరి శైవాగమోక్తంగా పుణ్యహవాచనం నిర్విహించి ఆ పరమ పవిత్ర జలంతో రజత మకర తోరణాన్ని సoప్రోక్షణ చేసి శ్రీ వల్లి దేవసేన సమేత 

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల మూలవిరాట్లకు అమర్చటం జరిగింది.


 శ్రీ తాడేపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ దంపతులు ఈ అద్భుత కార్యక్రమంలో సమర్పించిన నూతన వస్త్రాలను అమ్మవార్లకు, అయ్యవారికి ధరింపచేసిన పిమ్మట , షోడషోపచార పూజ , స్వామి వారికి ఇష్టమైన చిమ్మిరి ప్రసాద నివేదన , మహా మంత్రపుష్ప సమర్పణతో రజత మకరతోరణ అలంకరణ కార్యక్రమం పూర్తయినది. 


  ఆ తదుపరి , దాతలకు, భక్తులకు ప్రసాద వితరణ , దాతలకు శేష వస్త్ర బహుకరణ, వేద ఆశీర్వచనం తో నేటి అత్యంత విశేష కార్యక్రమం ముగిసినది.


     భక్తులు అందరూ ఈ అలంకరణ తరువాత స్వామి, అమ్మవార్లఅందం ద్విగుణీకృతమైనదని అభిప్రాయం వెలిబుచ్చారు. 


      ఈ కార్యక్రమము విజయవంతం కావటానికి సహకరించిన పీఠనిర్వాహకుడు,

 శ్రీ నాగభూషణం గారికి, ప్రసాదాన్ని తయారు చేసిన శ్రీమతి దుర్గగారికి, రాజేష్ అర్చకునకు, సమస్త అండ దండలు అందించిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు. 


     రజత మకరతోరణాన్ని సమర్పించిన 

 శ్రీ తాడేపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారికి, వారి శ్రీమతి శైలజ గారికి వారి కుటుంబ సభ్యులకు

 శ్రీ వల్లి దేవసేన సమేత

 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కృపా కటాక్షములు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ:


కార్యవర్గం,

శ్రీ శైవ మహాపీఠం.

విజయవాడ.