Tuesday, October 5, 2021

ఆరాధ్య బంధువులకు నమస్కారం. ది అక్టోబర్ 7 వ తారీకు నుండి 15 వ తారీకు వరకు శ్రీ శైవ మహాపీఠం, విజయవాడ ప్రాంగణము లో దసరా మహోత్సవ ము జరుగును. ప్రతి రోజు అమ్మవారి కి విశేష అలంకారము , కుంకుమార్చన మరియు ప్రసాద వితరణ జరుగును.15 వ తారీకు శుక్రవారం విజయదశమి నాడు చండీ హోమం జరుగును. తొమ్మిది రోజులు కుంకుమర్చన చేయుంచదలచినవారు గోత్ర నామాలు తెలిపి రూ 1116/- రుసుము శ్రీ శైవ మహాపీఠం నందు చెల్లించి రసీదు పొంద వలెను. చండీ హోమం చేయుంచదలచినవారు గోత్రనామాలు తెలిపి రూ 1116/- రుసుము అదనముగా చెల్లించి రసీదు పొందవలెను. పూజలన్నియు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరోక్షంగానే జరుపబడును. కావున ఆరాధ్య బంధువులు అధిక సంఖ్య లో పూజలు చేయుంచుకుని అమ్మ వారి ఆశీస్సులు పొంద ప్రార్ధన. బ్యాంకు ద్వారా రుసుము చెల్లించిన యెడల UTR/Transaction నెంబరు, గోత్రనామాలను ఈ క్రింది కార్యవర్గ సభ్యులలో ఒకరికి తెలియచేయవలెను. శివశ్రీ కందుకూరి బాలాజీ 8341742691 శివశ్రీ ఇవటూరి కృష్ణకుమార్ 8374471188 శ్రీమతి శ్రీపతిపండితారాజ్యుల రమా 9493247440 వాట్సాప్ ద్వారా తెలియచేయవలెను. రసీదు వాట్సాప్ ద్వారా పంపబడును .బ్యాంకు వివరములు క్రింద తెలియచేయటమైనది. BANK DETAILS Name of the Account : SRI SAIVA MAHA PEETHAM Account number : 31685710170 Name of the Branch : SATYANARAYANAPURAM, VIJAYAWADA IFSC Code : SBIN0009001 ఇట్లు భవదీయుడు చాగంటి శాస్త్రి, అధ్యక్షుడు,తాత్కాలిక కార్యవర్గము శ్రీ శైవ మహాపీఠం,విజయవాడ 96180 81368

Monday, March 1, 2021

ఆరాధ్య బంధువులకు నమస్కారం. ఈ రోజు మన శ్రీ శైవ మహాపీఠము నందు కొలువైన శ్రీ సుభ్రమణ్యశ్వరస్వామి స్వామి కి శివ శ్రీ ఓగిరాల వెంకటేశ్వర రావు గారికి అల్లుడు శ్రీ గురజాడ సుబ్బారావు గారు కుమార్తె శ్రీమతి లక్ష్మి దమయంతి దంపతులు స్వామి వారికి సువర్ణ కనుబొమ్మలు బహుకరించినారు. వారికి,వారి కుటుంబసభ్యులకు సుభ్రమణ్యశ్వరుని ఆసిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమములో శివశ్రీ ఓగిరాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, వారి కుమారుడు శివ శ్రీ ఓగిరాల సుబ్బారావు గారు,తాత్కాలిక కమిటీ కార్యదర్శి శివ శ్రీ కందుకూరి బాలాజి, సహాయ కార్యదర్శి శివ శ్రీ ఇవటూరి కృష్ణ కుమార్ గారు, సభ్యులు శివ శ్రీ కాశీనాధుని సుధాకర్ పాల్గొనినారు.ఇట్లు చాగంటి శాస్త్రి, అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ తాత్కాలిక కమిటీ