శివాయగురవే నమః
ఆరాధ్య బంధువులకు నమస్కారము.
శ్రీశైవమహాపీఠము,విజయవాడ నందు శరన్నవరాత్రి ఉత్సవములు ఆరాధ్య శైవసాంప్రదాయము లో ది 26/09/2022 సోమవారము సాయంత్రం 5 గంటలకు శివశ్రీ కొంపల్లి వెంకట నారాయణ శర్మ దంపతులు గణపతిపూజ, పుణ్యాహవాచనము, ప్రదోష కాలములో అఖండ ప్రతిష్టాపన, అస్త్రమండపారాధన (కలశస్థాపన) చేసినారు మల్లికార్జున స్వామి వారికి ఏక రుద్రాభిషేకము జరిగినది శివశ్రీ తాడికొండ రమణ మూర్తి దంపతులు భ్రమరాంబ అమ్మవారికి శ్రీసూక్త విధానంగా లలితా సహస్రనామార్చన చేసినారు అనంతరము మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ జరిగినది శివశ్రీ కొంపల్లి వెంకట నారాయణ శర్మ దంపతులు శివశ్రీ తాడికొండ రమణమూర్తి దంపతులకు స్వామి వారి శేషవస్త్రములు,ప్రసాదము బహుకరించినారు
శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారు ,శివశ్రీ ములుగు రామలింగం గారు ఆధ్వర్యములో కార్యక్రమములు జరిగినవి .ఆరాధ్యులు, ఆరాధ్య బంధువులు కార్యవర్గ సభ్యులు కార్యక్రమములలో పాల్గొనినారు.
ఇట్లు
కొమర్రాజు స్వయంభువు
అధ్యక్షులు,
శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ
No comments:
Post a Comment