Saturday, December 30, 2023

సంకష్టహర చతుర్ది 30.12.2023

 భక్తులకు విజ్ఞప్తి 


ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ శైవ మహాపీఠము విజయవాడలో ప్రారంభమైన గణపతి హోమము.;పూజ









Sunday, December 24, 2023

Uma Maheswara vratam 24.12.23

 💐💐సభ్యులకు నమస్కారం.🌷🌷
































































 ఈరోజు శ్రీశైవ మహాపీఠం విజయవాడలో జరిగిన శ్రీ ఉమామహేశ్వర వ్రతం  వైభవోపేతంగా, అద్వితీయంగా, భక్తి పరవశంతో, విశేషమైన శ్రద్ధతో, శివ కేశవులకు భేదం లేదు అనే నానుడి నిజం చేస్తూ ఈ మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి నాడు దిగ్విజయంగా జరిగింది.


20 మంది జంటలతో ఉదయం 11 గంటలకు శైవ సంప్రదాయంతో దీపారాధన విఘ్నేశ్వర పూజ తో ప్రారంభమై మండపారాధన, ఉమామహేశ్వరుల  రజత రూపులకు అభిషేకం మరియు అర్చన,  తరువాత కొబ్బరికాయలు అప్పాలు వడపప్పు పానకం,  బెల్లంతో కలిసిన గోధుమపిండి నైవేద్యం అనంతరం ఉమామహేశ్వర వ్రత కథలతో మధ్యాహ్నం  3గంటలకు మంత్రపుష్పంతో  వ్రతం పరిసమాప్తి అయింది.

వ్రతంలో పాల్గొన్న దంపతులందరూ కొంచెం కాలాతీతమైనా, వయస్సును లెక్కచేయకుండా, భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నాలుగు గంటలు కూర్చొని వ్రతంలో పాల్గొన్నారు. వ్రతం అనంతరం దంపతులందరూ బ్రహ్మ గారైన శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందారు.


వ్రతంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదములు, వ్రతం సమయంలో సేవలు అందించిన ఆరాధ్య బంధువులందరికీ, కార్యక్రమం  చక్కగా నడిపించి నందుకు బ్రహ్మ గారైన శివశ్రీ ముదిగొండ బాల  శశాంక మౌళి గారికి మరియు విరాళములు ఇచ్చిన దాతలకు అభినందనలు కమిటీ కార్యదర్శి శివశ్రీ  ఇవటూరి శివరామకృష్ణ కుమార్ గారు తెలియజేశారు. 


స్వామివారి సేవను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన శివశ్రీ సింగరాజు భాస్కర్ గారికి,  శ్రీమతి ఎస్పి రమ గారికి,  ప్రత్యేక సేవలు అందించిన శివశ్రీ శివదేవుని పవన్ కుమార్ గారికి శివశ్రీ చాగంటి శ్యామ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియ జేసుకుంటున్నాము. 


చివరగా పీఠం కోశాధికారి శివశ్రీ కొంపల్లి వెంకటనారాయణ శర్మ గారు  వందన సమర్పణ గావించారు. 


అనంతరం వ్రతం చేసుకున్న దంపతులు మరియు వారి బంధువులు, కార్యకర్తలు,  కమిటీ సభ్యులు అందరూ  శ్రీమతి దుర్గ గారు వండిన రుచికరమైన అన్న ప్రసాదం స్వీకరించారు.


పాదచారులకు పీఠం వెలుపల కిచిడి అన్న ప్రసాదం పంపిణీ జరిగింది. 

💐💐💐 శుభం శుభం శుభం 🌷🌷🌷

ఇట్లు 


శ్రీ శైవ మహాపీఠం, 

కార్యవర్గము

 విజయవాడ