Vijayawada Ganarchana భక్తులకు నమస్కారం
శ్రీ శైవమహాపీఠము,విజయవాడ నందు ఈ రోజు అనగా ది 05/12/2023 మంగళవారం ఉదయం బ్రహ్మశ్రీ విష్ణు శంకర్ గారి బ్రహ్మత్వములో అభిషేకమునకు, అన్నదానమునకు ధనరూపము లోను,వస్తురూపము లోను శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సమర్పించుకున్న భక్తుల గోత్ర నామాలు చదివి లఘున్యాస పూర్వకముగా పంచామృతాలతో, ఫల రసాలతో, నమక, చమక, పురుషసుాక్త, శ్రీసుాక్తాలతో ఏక వార రుద్రాభిషేకం, శివ సహస్ర నామాలతో వివిధ రకముల పుష్పములతో, బిల్వదళములతో అభిషేకం జరిగినది.శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపెశ్వర శర్మ గారు, శివశ్రీ బుద్దిరాజు లక్ష్మి శంకర్ గారు,శివశ్రీ మల్లికార్జున పండితారాద్యుల నాగభూషణం గారు శ్రీ మల్లికార్జున స్వామి వారికి స్వయంగా అభిషేకం చేసుకున్నారు. అర్చన,నీరాజన, మంత్ర పుష్పము అనంతరము తీర్ధ ప్రసాద వితరణ జరిగినది.
సాయంత్రం 6.30 గంటలకు గణార్చన కార్యక్రమం మొదలైనది. గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు. గణార్చన చేసుకున్నవారు శివశ్రీ ముదిగొండ ఉమా నాగ మల్లేశ్వర తేజస్వి గారు దంపతులు. బ్రహ్మ గారు శివశ్రీ ములుగు రామలింగం గారు గణార్చన నిర్వహించారు.
గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు గణార్చన చేసుకున్నవారికి రజిత ఉమామహేశ్వరుల రూపును బహుకరించినారు.
శ్రీశైవపీఠము కార్యవర్గ సభ్యులు, ఆరాధ్యులు, ఆరాధ్య బంధువులు హాజరు అయినారు. అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది.
రేపు అనగా 06/12/2023 బుధవారం గణార్చన చేసుకొనువారు శివశ్రీ శివదేవుని విజయ్, బెంగుళూరు గారు దంపతులు.
కావున భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి తీర్ధ, ప్రసాదములు,ఆశీస్సులు పొందగోరుచున్నాము.
ధన్యవాదములు
ఇట్లు
కార్యవర్గం
శ్రీ శైవమహాపీఠము
విజయవాడ
No comments:
Post a Comment