Friday, March 8, 2024

మహా శివరాత్రి 8.3.24








 💐💐 భక్తులకు శుభోదయం🌷🌷


 మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శైవ మహాపీఠం విజయవాడలో జరిగిన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, రుద్ర హోమం, శాంతి కల్యాణము మరియు లింగోద్భవ కాలంలో జరిగిన అభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ అభినందనలు.

ఈ కార్యక్రమాలన్నీ  ఉపవాస దీక్షలో ఉండి, పాల్గొని మరియు వీక్షించి అన్నప్రసాదం స్వీకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించిన కమిటీ సభ్యులకు,  పీఠము మేనేజర్ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. 

తన స్పష్టమైన మంత్రోచ్ఛారణతో ఈ మహాశివరాత్రి పూజలన్నీ ఉన్నత స్థాయిలో నిర్వహించిన బ్రహ్మగారు శివశ్రీ ముదిగొండ బాల శశాంక్ మౌళి గారికి, వారికి సహకరించిన శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారికి  మరియు పీఠము పూజారి శ్రీ విష్ణు శంకర్ తివారి గారికి ప్రత్యేక అభినందనలు.

ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం అయిన భక్తుల తోడ్పాటు ధన రూపంలోనూ,  వస్తు రూపంలోనూ మరియు సేవల రూపంలోనూ సహకరించిన భక్త మహాశయులందరికీ అనేక ధన్యవాదములు.

💐 శుభం శుభం శుభం💐

ఇట్లు
 శ్రీ శైవ మహాపీఠం
 కార్యవర్గము
 విజయవాడ





















 

No comments:

Post a Comment