Thursday, August 29, 2024

శ్రావణమాసం 29.08.2024




ఈరోజు శ్రీశైవ మహాపీఠము, విజయవాడలో శుభ శ్రావణమాసంలో పీఠంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారికి  శ్రీ సూక్త విధానంగా, పంచామృత స్నపన పూర్వక ఖడ్గ మాలార్చన సహిత లలితా సహస్రనామార్చన ప్రత్యేక పూజలు ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైనవి.


పూజల ప్రారంభానికి ముందుగా భక్తుల గోత్ర, నామాలు యధావిధిగా బ్రహ్మగారు చదవటం జరిగింది.


ఈరోజు ప్రత్యేక పూజలు లో  భాగంగా  శ్రావణపట్టి సారెను కొందరు భక్తులు అమ్మవారికి సమర్పించారు. 


ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పీఠంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారికి అన్నాభిషేకం జరిగింది. 


అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన మంత్రపుష్పం తరువాత విచ్చేసిన భక్తులకు తీర్థ, ప్రసాదాలు (వడపప్పు, పానకం, రవ్వ కేసరి,  చలిమిడి, రవ్వ లడ్డు, పులిహోర మరియు అరటి పండ్లు, బత్తాయిలు, యాపిల్ పండ్లు మొదలగు) పంపిణీ జరిగింది. 


ఈనాటి ప్రత్యేక పూజలలో శివశ్రీ శ్రీపతి పండితారాధ్యుల విశ్వేశ్వర రావు గారు పాల్గొన్నారు వారికి సహాయంగా శివశ్రీ కొంపల్లి వెంకటనారాయణ శర్మ మరియు శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణ కుమార్ గార్లు సేవలు అందించారు. బ్రహ్మగా శివశ్రీ ముదిగొండ బాల శశాంక్ మౌళి గారు వ్యవహరించారు.


ఈనాటి కార్యక్రమానికి కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేశారు.  అధిక సంఖ్యలో మహిళలు ఇతర భక్తులు హాజరై పూజల అనంతరం అమ్మవారిని, అయ్య వారిని సందర్శించుకుని స్వామి వార్ల ఆశీస్సులు పొందారు.





























Tuesday, August 6, 2024

శ్రావణమాసం 5.8.2024

 ఈరోజు  5.8.24 శ్రీశైవ మహాపీఠము, విజయవాడలో  శుభప్రదమైన ఈ శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు భక్తులు విరాళముగా స్వామివారికి అమ్మవారికి అందించిన నూతన రజత ఆభరణముల సంప్రోక్షణ మరియు అలంకరణ కార్యక్రమానికి (ఉదయం 10:00) అందరిని ఆహ్వానిస్తున్నాము.