Tuesday, August 19, 2025

శ్రావణ మాసం: మంగళవారం 19.8.25







శ్రీశైవ మహాపీఠము, విజయవాడలో అత్యంత వైభవంగా19.8.25























జరుగుతున్న శ్రావణమాసం ఉత్సవాలలో భాగంగా ఈరోజు మంగళ వారం (19/8/25) ఆఖరి శ్రావణమంగళవారం నాడు అమ్మవారి పూజలు వేదోక్తంగా, భక్తి పూర్వకంగా బ్రహ్మ శివశ్రీ ముదికొండ బాలశాశంక మౌళి  గారి ఆధ్వర్యంలో జరిగాయి.


శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా, పంచామృత స్నపన పూర్వక, ఖడ్గమాలార్చన సహిత లలితా సహస్రనామ కుంకుమార్చన మరియు లలిత అష్టోత్తర పుష్పార్చన అత్యంత భక్తి పూర్వకంగా జరిగింది. ఈనాటి పూజలలో  శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణ కుమార్ మరియు ఇవటూరి ప్రసాద్ బాబు గార్లు పాల్గొన్నారు.


ఈరోజు ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. ఈ అభిషేకంలో శివశ్రీ బండారు వీర రాజేశ్వరరావు, శ్రీ శ్రీరామచంద్రమూర్తి గార్లు పాల్గొన్నారు.


నీరాజన, మంత్రపుష్పా నంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.


అనంతరం ఈరోజు ప్రత్యేక ప్రసాదం *మినప గారెలు* శివశ్రీ   తాడికొండ రమణమూర్తి, శ్రీమతి  మాధురి గార్లు సమర్పించారు .

No comments:

Post a Comment