శ్రీ శైవ మహాపీఠము విజయవాడ నందు జరుగుచున్న శరన్నవరాత్రులలో ఈ రోజు ఉదయం మహర్ణవమి సందర్భముగా శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారు శ్రీ మహిషాసూరమర్థిని గా దర్శనమిచ్చారు.
నవరాత్రుల ఈనాటి పునః పూజలో దీక్షా కంకణ ధారులైన శివశ్రీ కొంపల్లి వెంకటనారాయణ శర్మ దంపతులు పాల్గొన్నారు.
సంకల్పము లో అలంకారం సమర్పించిన వారి , ప్రసాదాలు సమర్పించిన వారి , అమ్మవారికి చీర సమర్పించిన వారి , అన్నదానము నకు విరాళము సమర్పించినవారి , మరియు తొమ్మిది రోజులు అభిషేకం , కుంకుమ పూజల భక్తుల గోత్రనామాలు చదవడం జరిగింది.
అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం శివశ్రీ తాడికొండ రమణమూర్తి గారు, శివశ్రీ కొంపల్లి వెంకట నారాయణ శర్మ గారు, శ్రీ బందా సాయి రాఘునాగ్, శ్రీహర్ష గార్లు నిర్వహించారు .
అనంతరం అమ్మవారికి కుంకుమ పూజను శివశ్రీ తాడికొండ రమణ మూర్తి గారు,శ్రీ బందా సాయి రాఘునాగ్ గారు శ్రీమతి సృజన శాంకరి దంపతులు , శ్రీ హర్ష దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమము లను బ్రహ్మ గారైన శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారు మంత్రాలతో ఘనంగా జరిగాయి.
అనంతరం భక్తులకు పులిహోర,చక్కర పొంగలి ప్రసాద వితరణ జరిగింది.
*ఈరోజు ప్రసాదము సమర్పించుకున్నవారు*
శివశ్రీ చాగంటి శ్రీనివాస్ గారు శ్రీమతి శైలజ దంపతులు
శ్రీ బందా సాయి రఘునాగ్ గారు శ్రీమతి సృజన శాంకరి గారు దంపతులు
శ్రీ అడవి శ్రీకృష్ణ చైతన్య గారు, శ్రీమతి హరిచందన గారు దంపతులు, USA
శివశ్రీ శివదేవుని శ్రీనివాస్ పవన్ కుమార్ గారు శ్రీమతి వెంకట మానస గారు దంపతులు
*ఈరోజు అమ్మవారి అలంకారము* *సమర్పించినవారు*
శివశ్రీ చాగంటి శ్రీనివాస్ గారు శ్రీమతి శైలజ దంపతులు,
శ్రీ బందా సాయి రఘునాగ్ గారు శ్రీమతి సృజన శాంకరి గారు
*అమ్మవారి అలంకారమునకు చీరను సమర్పించినవారు*
శివశ్రీ చాగంటి శ్రీనివాస్ గారు శ్రీమతి శైలజ గారు దంపతులు
సాయంత్రం విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు.
సాయంత్రం అమ్మవారికి జరిగిన కుంకుమ పూజలో శివశ్రీ తాడికొండ రమణమూర్తి గారు మరియు శివశ్రీ మల్లికార్జున పండితారాధ్యుల నాగభూషణం గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
సాయంత్రం జరిగిన శమీ పూజను బ్రహ్మ గారు శివశ్రీ ములుగు రామలింగం గారు దీక్ష ధారులతో
చేయించారు.
భక్తులందరూ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసి మంత్రాన్ని జపించి వారి కోరికలను స్వామివార్లకు విన్నవించుకున్నారు.
సాయంత్రం పంచ హారతులు, నీరాజనం మంత్రపుష్పములు తదుపరి రవ్వలడ్డు, వడలు ప్రసాద వితరణ జరిగినది.
అమ్మవారికి శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారు కన్నుల విందుగా అలంకారం చేశారు.
ఈనాటి కార్యక్రమాలతో ఈ శరన్నవరాత్రులు దిగ్విజయంగా వైభవపేతంగా ముగిశాయి.
కార్యక్రమాలు ఇంత చక్కగా జరగటానికి కారణమైన భక్తులందరికీ కమిటీ వారు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.
ఇదే స్ఫూర్తితో రాబోయే కార్తీకమాసం కూడా శివమయంగా జరగటానికి భక్తులందరూ తోడ్పడుతారని ఆశిస్తున్నాము.
ఇట్లు
శ్రీ శైవమహాపీఠము
విజయవాడ
కార్యవర్గం

Eeroju Sri mahishasura mardhini alankarana lo.,,,, bramaramba