కార్తీకమాసం
ఐదవ రోజు, 6.11.24
బుధవారం ఉదయం అభిషేకార్చనల భక్తులు మరియు అన్న ప్రసాద వితరణ దాతల గోత్రనామాలు చదివి, లఘున్యాస పూర్వక ఏకవారాభిషేకం, శివ సహస్రనామార్చన, నీరాజనం మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది.
అభిషేకంలో శ్రీ లంక వెంకట సూర్యనారాయణ శర్మ మరియు శివశ్రీ మల్లికార్జున పండితారాధ్యుల నాగభూషణం గారులు పాల్గొన్నారు. బ్రహ్మగా శివశ్రీ ముదిగొండ బాల శశాంక్ మౌళి గారు వ్యవహరించారు.
సాయంత్రం జరిగిన నిత్య గణార్చన లో గురు స్థానం మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారికి, శివశ్రీ భoడారు వీర రాజేశ్వరరావు దంపతులు మహేశ్వర గణార్చన చేసుకున్నారు.
అనంతరం వీరికి గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ బాపేశ్వర శర్మ గారు రజత లలితా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ ప్రతిమను బహూకరించారు.
విచ్చేసిన ఆరాధ్యుల కుటుంబాలకు, ఇతర భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
*వివరణ* : నాగుల చవితి రోజున పీఠంలోని వంటశాలలో వంటలన్నీ కత్తిపీటతో తరగని కూరలతో వంట మనిషి, ఆరాధ్యుల ఆడపడుచు శ్రీమతి దుర్గ గారు రుచిగా చేయడం జరిగింది. ( బెల్లం పరమాన్నం, బంగాళదుంప ముద్దకూర, ముద్ద పప్పు, కరివేపాకు పొడి, పచ్చిమిర్చి రోటి పచ్చడి, పులిహోర మరియు మెంతి మజ్జిగ)
No comments:
Post a Comment