4.11.24 - 3 వ రోజు ఉదయం అభిషేకార్చనల భక్తుల అందరి గోత్రనామాలు చదివిన తరువాత కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక ఏక దశ రుద్రాభిషేకం, శివ సహస్రనామార్చన, నీరాజనం మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది.
అభిషేకంలో శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణ కుమార్, భoడారు వీరరాజేశ్వర్ రావు, శ్రీ ఫణి కుమార్, చిరంజీవి శరణ్ మనోజ్ మరియు కొంపల్లి వెంకటనారాయణ శర్మ గారులు పాల్గొన్నారు. బ్రహ్మగా శివశ్రీ ముదిగొండ బాల శశాంక్ మౌళి గారు వ్యవహరించారు.
నిత్య గణార్చన లో గురు స్థానం మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారికి, శివశ్రీ జోశ్యుల పూర్ణానందం దంపతులు మహేశ్వర గణార్చన చేసుకున్నారు.
వీరికి గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ బాపేశ్వర శర్మ గారు రజత లలితా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ ప్రతిమను బహూకరించారు.
అనంతరం మొదటి కార్తీక సోమవారం సందర్భంగా అశేషంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
కార్యవర్గం
శ్రీ శైవ మహాపీఠము

No comments:
Post a Comment