Monday, April 25, 2022
ఆరాధ్య బంధువులు అందరికీ నమస్కారం. శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ వారి నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 2022 సం. వార్షిక బ్రహ్మోత్సవాలు (22/4 నుండి 24/4/2022) నిన్నటితో శివ కళ్యాణం, అన్న ప్రసాద వితరణతో పరి సమాప్తి అయినవి. ఈ శుభ సందర్బంగా ఈ రోజు (25/4/22- సోమ వారం) నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ వేసవి మండుటెండలో దాదాపు 500 మంది పాదచారులకు కొత్తిమీర మజ్జిగ ను శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ వద్ద పంపిణీ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవ దాతలు అందరికీ మరొక మారు ధన్యవాదములు. ఇట్లు, కొమర్రాజు స్వయంభువు, అధ్యక్షులు మరియు ఇతర కార్య వర్గ సభ్యులు.
Sunday, April 24, 2022
ఆరాధ్య బంధువులకు నమస్కారం. శ్రీ శైవమహాపీఠము, విజయవాడ వార్షికోత్సవములలో భాగముగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగును . ఈ శాంతి కళ్యాణము శ్రీ కారణ ఆగమము లో శైవ సంప్రదాయం లో శివశ్రీ ముదిగొండ బాల శశాoక మౌళి, నందిగామ శ్రీ సుక శ్యామలాoబా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ స్థానాచార్యులు గారి ఆధ్వర్యంలో జరుగును. కనుక మన ఆరాధ్య బంధువులు అందరు ఈ వివేష కళ్యాణ మ హోత్సవములో పాల్గొని అన్న ప్రసాదము (భోజనం )స్వీకరించి ఆది దంపతుల కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్ధించు చున్నాము ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు, అధ్యక్షులు, శ్రీ శైవ మహా పీఠం, మరియు కమిటీ సభ్యులు విజయవాడ.
ఆరాధ్య బందువులకు నమస్కారం ఈ రోజు ఉదయము శ్రీశైవపీఠస్థత సకలదేవత శైవ సాంప్రదాయ పద్దతి లో హోమాలు జరుగును అనంతరము పూర్ణాహుతి , తీర్ధ ప్రసాద వితరణ జరుగును . సాయంత్రము శ్రీశివపార్వతుల శాంతి కళ్యాణము అనంతరము అన్నప్రసాద(భోజనము) వితరణ జరుగును . కార్యక్రమము నకు శ్రీ శైవ మహాపీఠం ప్రధాన కార్యదర్శి శివశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథి గా విచ్చేయు చున్నారు. ఆరాధ్య బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదము స్వీకరించి బ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల కృప కు పాత్రులు కాగలరు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు, అధ్యక్షులు శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ
Friday, April 22, 2022
ఆరాధ్య బంధువులు కి నమస్కారం: మన పీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు లో ఈ రోజు అభిషేకాలలో పాల్గొన దలచిన ఆరాధ్య బంధువులు అందరూ ఈ ఉదయం 8 గం. కు సాంప్రదాయ దుస్తులు తో విచ్చేసి స్వామి వార్ల కు జరిగే ఈ అభిషేకాలు లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు, అధ్యక్షులు, శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ
ఆరాధ్య బంధువులకు నమస్కారం వార్షిక బ్రహ్మోత్సవములలో భాగముగా ఈ సాయంత్రం 7 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగును. కావున ఆరాధ్య బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించి బ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల కృప కు పాత్రులు కాగలరు. ఇట్లు కొమ్మర్రాజు స్వయంభువు. అధ్యక్షులు శ్రీ శైవ మహాపీఠము, విజయవాడ
Saturday, April 16, 2022
ఆరాధ్య బంధువులకు నమస్కారము 🙏🙏 పూజ్య శ్రీ పీఠాధిపతి గారి ఆదేశానుసారము ది 10/04/2022 ఆదివారం 3.00 గంటలకు శ్రీ శైవమహాపీఠము విజయవాడ శాఖ కు 2022 నుండి 2024 సంవత్సరము వరకు నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారము జరిగినది కార్యనిర్వాహక వర్గం :-- శివశ్రీ కొమ్మర్రాజు స్వయంభువు, అధ్యక్షులు శివశ్రీ చాగంటి శ్రీనివాస్ ఉపాద్యక్షులు, శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణకుమార్ కార్యదర్శి శివశ్రీ కొంపల్లి వెంకట నారాయణ శర్మ కోశాధికారి శివశ్రీ సింగరాజు భాస్కర్ రావు సంయుక్త కార్యదర్శి శివశ్రీ ముదిగొండ బాల శశాoకమౌళి. సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు :--- శ్రీమతి శ్రీపతిపండితారాద్యుల రమ శ్రీమతి కాశీనాధుని హైమావతి శివశ్రీ తాడికొండ రమణ మూర్తి. శివశ్రీ కాశీనాధుని సుధాకర్ శివశ్రీ శివదేవుని శ్రీనివాస పవన్ కుమార్ కావున నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవమునకు ఆరాధ్య బంధువుల కలయికతో నూతన కార్యవర్గము ఇట్లు, భవదీయుడు, శ్రీ కొమర్రాజు స్వయంభు అధ్యక్షులు, శ్రీశైవమహాపీఠము విజయవాడ శాఖ
Subscribe to:
Posts (Atom)