Sunday, May 31, 2020

అన్నదానo విజయవాడలో   శ్రీ శైవ మహా పీఠంలో 🌹🌹
🍎🥭🍓🍏🥭🍇🍅🍓🍎
             విజయవాడ శ్రీ శైవ
మహాపీఠo వారు గత రెండు నెలలనుండి  బీద బ్రాహ్మలకు, బలహీన , బడుగు  వర్గాల వారికీ ,  అన్నదానం చేస్తున్న సంగతి విదితమే  అది ఈ రోజుతో  ముగిసింది అని చెప్పుటకు అందరికి తెలియ పరుచుచున్నాము .ప్రతి రోజు జీవితంలో సూర్యోదయం
లగాయతు, ఆర్ధిక ఆరాటాలు ,  ఆకలి ఆరాటాలు !  ఆకలి కోసం ఆస్తులకోసం పోరాటాలు చేసే వాళ్ళం , ఇప్పుడు ప్రాణం కోసం !  ప్రాణాల
కోసం, పోరాటాలు చేస్తున్న ఈ సమయంలో ,  శ్రీ శైవ మహాపీఠం తరుపున మేము ఉన్నాం అని తోటి బ్రాహ్మలకు నిత్యం అవసరమైన  పచారీ గ్రాసం 6 రకాల  పదార్ధాలను , దినమునకు  కొంతమందిని  చప్పున నిర్ణయంచి , వారికీ మనవారే  ఫలానా డేట్ న రమ్మని చెప్పి  , ఉదయం
 9-  00 లోపు మన వంతు సహాయ సహకారాలు , అన్నదాన రూపంలో , అనేక రకములైన ఆహార పదార్ధాలు అనగా పులిహార  ,రవ్వపులిహార ,పెరుగన్నం  నిమ్మ  పులిహార సాంబారన్నం , పప్పన్నం ,పళ్ళు  అనగా మామిడి , అరటి , కొన్నిరకాల పళ్ళు ,మజ్జిగ ,
లస్సి,  ఈ విధముగా మన ఆరాధ్య బంధువులు !  మరి యూ  ఇతరులు కలిసి సహాయ సహకారాల వలన,
పోలీస్ డిపార్ట్మెంట్ వారికీ , పారిశుద్ధ
కార్మికులకు ,ముఖ్యముగా మన బీద బ్రాహ్మలకు, ......మనవారందరు పాల్గొని ,జీవితంలో మంచి రోజులు చూడాలంటే
చెడ్డరోజులను, దాటుకొని  వచ్చుటకు , మన వంతు సహాయ సహకారాలు అందచేసిన విజయవాడ శ్రీ
శైవ మహాపీఠం మనం , జంటనగర శాఖా  వారు, ఇరు  ప్రదేశముల కార్యకర్తలు , కార్య నిర్వాహకులు  కూడా "ఓర్పు "  అనేది  ఎంత చేదుగా  ఉంటుందో !
దానికి వచ్చే ప్రతిఫలం  అంత తియ్యగా ఉండే విధంగా నిర్వహించి మన వారందరికీ విధి నిర్వహణలో  ఎన్ని పనులున్నా   ఆ సమయమునకు వచ్చి అన్నదాన కార్య క్రమానిని
నిర్వహించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ,ఎంతో మంది నిరుపేదల ప్రేమాభి మానాలు చూరగొన్న మనము ఎంతో ధన్యులమని ,చెప్పవచ్చును మన శైవ మహాపీఠం వారందరు చాల ఆనందించవలసిన  విషయం , మనకోసం  వేచి చూసే బీద వారికీ మనకి వీలున్నప్పుడు పెట్టడం కంటే !       వీలు చేసుకొని ఇటువంటి సమయంలో ,ఈ
దానమే సద్వినియోగమైన  ఫలితాలిస్తుంది  అనడంలో ఏ. మాత్రం సందేహం లేదు ,
అన్ని విధాలా సహాయ ,సహకారాలు అందచేసిన వారికీ ఆ ఆదిదంపతులు  ఇటువంటి కార్యాలు ఇంకా ఎన్నో చేసే చేసే అవకాశం ఇస్తుందని  ఆసిస్తూ  తాత్కాలిక కమిటీ వారి సహాయ సహాకారాలు  అందచేసిన వారందరికీ కూడ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంఈ రోజు అన్న దాతలు: 1)శ్రీమతి & శ్రీ:  పేపల్ల దశరథ రామయ్య (C.A.),వెంకట రమణమ్మ దంపతులు 2) నవులూరి రాజ శేఖర్, కమల దంపతుల కుమారుడు శివ సంతోష్ చైతన్య, లలిత రవళి దంపతులు, కుటుంబ సభ్యులు 3) కొంపల్లి నగేష్ కుమారు, మాధవి దంపతులు 4) చిత్తూరి వేంకటేశ్వర రావు, కామేశ్వరి దంపతులు
కలగాలని ఆసిస్తూ ,

సర్వే జనా సుఖినో భవంతు

మీ  ఆరాధ్య బoదువు
కాశీనాధుని సుబ్రహ్మణ్యం ,
గాంధీనగర్ , విజయవాడ.






























































No comments:

Post a Comment